పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/891

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
స్త్రీ విద్య
"నేనువ్రాసిన శ్లోకంబులోన విద్య,
యనెడుమాటయు వెదుకగా జనునటంచు
జాల బల్కిరి వెదుకగా నేల దాన,
నడగియున్నదిచూపెద" వనిరొలేదొ.

తే. తుదనుగలయట్టి యాచార్యపదము జూచి,

తానునాచార్యుడేయౌటదలచి యేమొ
యెంచె నీనృసింహాచార్యుఁ డెంతవాడు,
రామకృష్ణమాచార్యుఁగారమణఁదన్ను.
సుగంధి వృత్తము
వారు మున్నుదాహరించి వ్రాసినట్టి శ్లోకమం
దౌర చూపినారు విద్య యస్పదంబు వింతగా
నారయంగ నేల నింక నట్లు సందియంబు వో
నేరు పొప్పఁ బూడియున్న నిగ్గు పెల్ల గింపగాన్.
చిత్ర పదవృత
కొమ్మల విద్యకు స్వాతం , త్ర్యంబునకుం దగు సంబం
ధము త్రిదండికి సంసా , రంబునకుం గలమాడ్కిన్.
అచ్చ తెనుగు సీసము

సీ. ముదియవిద్దియ మున్నున్న దంటకుఁ

గబ్బముల్ పెక్కు తార్కాణగాగ
జూపితి గాదన నోపెద రేనియుఁ
జేతనై నంతయు జేయవలయుఁ
గా కది పోనాడికన్నెల పాటలఁ
దప్పిదంబులు గొప్ప కుప్ప లనుచు
నిప్పటినాదున కేమియుఁ బొసగని
చప్పిడిసుద్దులఁ జదువుఁటేల