పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/887

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్త్రీవిద్య

చ.మునుపటివారు చెప్పినది మొక్కలపున్మది :పూనిసర్వముం
గొనఁ జనదంచు నామతముకూడ లవంబును గాదు,కాని యెం
దును మనబుద్ధికూడఁ గడుఁగూరిచి యార యుచుంట ముఖ్యమై
చనును హితాహితంబులపసల్ గని దుష్కృత ముజ్జగింపఁగ౯.

క.ప్రతిభావంతులు మిక్కిలి,
మతిమంతులుఁగలరు మిగుల మనపూర్వులలో
సతతము వాదము సల్పిరి;
యతులితవాగ్గరిమఁ గొన్ని యంశంబులలో౯.

మ.అయిన మ్మద్దియవిద్దియంగుఱిఁచి యెందైనం దగం దొంటియా
సయవేదుల్ తగదంచు వాదములు పూనం గంటిమే మీవల్౯?
దయమీఱంగను జెప్పుఁడయ్య!యలసిద్ధాంతంబు లెందైన మీ
నయనానందముచేసెనేమొ వినఁగంగౌతూహలంబయ్యెడున్.

ఉ."వారణయాన లెల్లరును బాటల నేర్తురు గాని వారిలో
నారయ వానితగ్ధ మొకరై నను నేర్చినవారె" యంచు మీ
రూరక వాదులాడెద రయే!మనపాటలయర్ధ మంగనల్
నేర రె? యిట్లు మీ రనిన,నిక్కములోకము తానెఱుంగదే?
గీ.పాటలాధరల్ పాడెడుపాటలందుఁ
దప్పిదంబులు కుప్పలై యేప్పుఁగాన
వానియర్ధముఁ దెలియరు వారాటంచుఁ
జెప్పునొప్పునె?యేప్పులకుప్పలార.

ఉ.వింతగ వాద మేల యవివేకులపోలిక;స్త్రీలవిద్య సి
ద్ధాంతమె చేసినారు మనతద్జ్జులు పూర్వులు;వేద మొక్కటే