పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/882

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
కామడీ ఆఫ్ ఎఱ్ఱర్సు

స. ఆం - రస్కర శ్రేష్ఠుడ దయచేయుమిటకు

మస్కరి చేష్టల మఱి కట్టి పెట్టి,
నీ బాధ్యతను నెల్ల, నేఁ డేమిచేసి,
యోబాలిశుడు ! వచ్చితో చెప్పునాకు.

ఎ. ద్రో- నాదు బాధ్యతయెల్ల నడువీధినుండు

యాదటమిముభోజనార్ధంబు బసకుఁ
గొనిపోవుటయె: ఆవలనట నీకొఱకుఁ
గనిపెట్టియుం దమ్మగారు, సోదరియు.

స. ఆం - స్ధాయిగ దెల్పుము దైవంబునెదుర,

నీయొద్దనుంచిన వేయివరాల
నేసురక్షిత మైనయిక్కను బెట్టి
నాసరసకువచ్చి నాడొవొ నిజము;
లేకున్న, మదినెమ్మి లేనప్పుడిట్లు,
నాకడ మేలముల్నడసించు చున్న
నీతలప్రక్కలు నేజేయుదిపుడు.
చేతిధనం బేమిచేసితొచెపుమ.

ఎ. ద్రో- వెదకినను, వరాలువేయినాయొద్ద

నొదవనేరవు; కాని యున్నవి వేయి
దెబ్బలు, తలమీద దేవర వారు,
కొట్టినవన్నియు గొన్ని తక్కువగ;
గట్టిగా నవియెల్ల గ్రమ్మఱ నేనుఁ
నేలిన వారు కర్పించుదునేనిఁ
దాళంగలే రేమొ తరువాతమీరు.