పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/881

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాంకము

ఎ.ద్రో-గుఱపుపల్లంబుకుట్టినందునకు, కుఱవాని కొసంగుకొఱ కిచ్చినట్టి నాలుగణాలునా? నావద్దలేవు; ఏల? వానికపుడెయిచ్చి పుచ్చుతిని.

స. ఆ.--ఉల్లాసముగలేను, నుల్ల మందిపుడు; కొల్లగ ముద్దులుగుడువక, యింక సొమ్మేడ నునిచితో సమ్మితిఁజెప్పు ; నమ్మితివేలాగు నరునినొక్కరుని, నూరికిఁ గడుక్రొత్తవారమై యుండ, నారీతిసొమ్మెల్ల నటఁబెట్టిరాఁగ!

ఎ. ద్రో--హాస్యోక్తులా యిప్పుడాడుచిన్నారు? హాస్యమావల భోజనావసరమున, నాడుకోవచ్చును ; అమ్మగారయ్యఁ దోడితేఁ బనిచెప్ప నీడవచ్చితిని. కొనిపోవకున్న, నాపనియౌనునిజము ; ననుగొట్టుఁ, దమదోషమునఁజేసియుమ్మ. కడుపె నాకునుబోలె గడియారమౌచు, కడి కింటికిని, దూత కార్యంబులేక, నినుఁగొట్టవలయును, నిక్కంబుగాఁగ, ననితోఁచుచున్నది యాత్మలోనాకు.

స. ఆం--రా, ద్రోమియో! యిటు రా; హాస్యమునకు, భద్రము: నీకిదవసరంబు గాదు; దాఁ చుకొమ్మివియెల్లఁ, దఱివచ్చుదాఁక! నీచేతికిచ్చిన నెఱధనమేది?

ఎ.ద్రో--నాచేతికా? మీరునాకెందుకొఱకు, తోఁచక ధనమియ్యఁదొలుతనువలసె!