ఈ పుట ఆమోదించబడ్డది
కామడీ ఆఫ్ ఎఱర్సు
నం. ఆం-ఉదకబిందువొకటి , యుదధిలోఁబడిన
యుదరబిందువు నొండు వెదకిపైఁదీయ గడలిలోపలఁజొచ్చి, కానక తాను నడఁగినవడువున, నన్ననుఁదల్లి నరయుదుననివచ్చి యందందతిరిగి, దురదృష్టమున నేనె తూలుచున్నాఁడ.
ఎసి- ద్రోమియోవచ్చుచున్నాడు.)
వడినింతవేగంబ వచ్చితివేమి?
ఎ. ద్రో--వేగమాయిది: చాలజాగయ్యెనిప్డు
వడవడి ద్రోమియోవచ్చుచున్నాదు మాగి దింపఁగఁబడె మాంసపుగూర : ఆవల గడియారమడిచెఁ బండ్రెండు, దేవిగారొక్కటితీసిరి నన్ను. అన్నంబు చల్ల్లాఱె; నందుచేవార లున్నారు కాఁకగా; నన్నమట్లయ్యె దేవరవారు మందిరము చేరమిని ; దేవర రారైరి తినబుద్ధిలేమి ; తినబుద్ధిలేదయ్యె దిట్టంబుగాను ఘనులెచ్చటనొ విందుఁగైకొనఁబోలు. మీకేమి? మీకొఱ కాఁకలితోడఁ జీకాకుపడి మేము చెడుచుంటి మింట.
స. ఆం-ఈపాటిచాలించు మీప్రసంగంబు,
నేపట్టునను, నమ్మి యేనునీచేత నిచ్చినద్రవ్యంబు నిప్పుడు పెట్టి వచ్చినాఁడవొచెప్పు వాస్తముగను,