Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/879

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాంకము

బడలియున్నఁడను,బలమెల్ల నుడిగి:
కడుపడిఁగదలు మిక్కడనుండనీవు.
ప.ద్రో-- నీమాటలనుబట్టి,నినుబట్టికొండు
రీమంచివేళ నె యేగుమువేగ
            (నిష్కమించెను.)
స.ఆం--చనవుకతంబున,సందేహపడక
యనయంబు హాస్యోక్తులను వచియించి,
నవ్వించి యలరించు,నామదియందు,
నెవ్వగలేమైన నెలకొన్న యపుడు,
దయచేసి,యిఁకఁగొంతతడవునాతోడఁ
బ్రియమార నటునిటు వీటనుదిరిగి,
సత్రంబునకువచ్చి, సరసభోజనము
మిత్రుఁడ! నాయింట మీరుచేసెదరే?

వర్త--విందునకునునన్ను బిలిచినేఁడొక్క
యిందలివర్తకుఁ డేగకయున్న
నెన్నియొ కార్యంబులిటఁ జెడుఁగాన
నన్ను నీవేళను మన్నింపవలయు.
ఐదుగంటలకును నంగడివీధి
కాదరమునవచ్చి, యామీద నిన్ను,
సాయంతనము నిద్రసమయంబుదాఁకఁ,
బాయకయుండెదఁ, బంపుమునన్ను,

స. ఆం---మంచిది. సెలవిమ్ము! మఱినేనపోయి
యించుకతిరిగెద నిందుమనందు.

వర్త---ఇచ్చవచ్చినయట్టు లెల్లెడఁదిరిగి
ముచ్చటదీరంగఁ బురమునుజూడు