కామడీ ఆఫ్ ఎఱ్రర్సు
2. ప్రదేశము.---ఒకబహిరంగస్ఠలము
(సరకాజియా ఆంటిఫోలసు, ద్రోమియా, ఒకవర్తకడు ప్రవేశించి
వర్త---ఎపిడామినమువాడనేననెఁబోకు;
నృపతి, యట్లన్నచోఁ, నీసొత్తుఁగొనును.
సరకాజియానుండి చనుదెంచినట్ట్టి
వరవర్తకుఁ డొకండు పట్టుకోఁబడియె,
నీవురంబుననేఁడె, యిటవచ్చెఁగాన;
పాపమాతడు, తనప్రాణముల్గాచి
కొనధనమీలేమిఁ, గోల్పోవుఁజుమ్ము
తనదుజీవంబును, తరణియీప్రొద్దు
చరమాద్రిసరసకు జరగకమున్న,
పురిరాజశాసనమునుబట్టి యకట!
ఇదెకొమ్ము నావద్ద నిచ్చినసొమ్ము,
పదిలంబుగా భద్రపరచికొమ్మావు.
స. ఆం---కొనిపొమ్ము, ద్రోమియో! మనముండుసత్ర
మునకునుదీనిని, మోసంబులేక
కనిపట్టియుండు మక్కడనీవు, నేను
జనుదెంచువరకును జ్రాగ్రత్తగాఁగ.
జాములో భోజనసమయమౌఁ గానఁ
నీమధ్య, నేఁబోయి యీవీటఁగలుగు
వారలనడవళ్ళు వర్తకసరణి,
చారుగృహంబులసౌరు, వీక్షీంచి,
చనుదెంచి నిదురింతు సత్రంబులోన.
వినుము మార్గాయాసమునఁజేసి, నేను
పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/878
Appearance
ఈ పుట ఆమోదించబడ్డది