పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/877

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రధమాంకము

మాశాస్త్రములకును, మారాజ్యమునకు,
మాశపదములకు, మాగణ్యతకును
వ్యతిరిక్తమేమియు నయియుండకున్న,
మదిలోననమ్ముము, మఱినీకు మేము
తప్పక యుపకారదానంబు సేయ
నిప్పుడు వలసినదే; యౌనుగాని,
మరణశిక్షనునీకు మాంపలేకున్న,
జేతనయినమేలుఁ జెసెదనీకు
నీతఱిమఱియేది యేమైనఁగాని:
కాఁబట్టి నే నేఁడు గడువిత్తునీకు,
వేఁబోయిసాయంబె వెదకికొంచీవు
ప్రాణంబునెట్లైన రక్షించుకొమ్ము;
త్రాణమై నిచటిమిత్రచయంబు నొకట
వేఁడియైనను, బదుల్వేఁడుయునైనఁ,
గూడఁబెట్టుముసొమ్ము, నేఁడెట్టులైన,
నటులైన బ్రతుకుదు నట్లుగాకున్నఁ,
బటుగతి జీవము ల్పాయంగ వలయు.
కారాగృహాధ్యక్ష! కావలినుంచు
ఘోరముగ నితనిఁగొనిపోయినీవు.
కారా---దేవ! యాలాగునఁగావింతు నేను.
దేవ! యాలగునఁగావింతునేను.
ఏజి---అసహాయుఁడౌచు, నిరాశనుజెంది
వెసఁబోయెను బెహారివెతలిన్మడింప.
(అందఱు నిష్కృమించిరి.)