పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/875

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రధమాంకము

గొనిపోవఁబడియెను; కోరింతుసీమ
బెసస్తలామువ్వుర వెలిఁ దాగ్చినట్టు
వాస్తవంబుగ దృష్టిపధమున ఁదోఁచె.
కడకు మేమును నొక్క పడవమీఁదికిని
విడువ కెక్కించుకోఁబడితిమి వేగ,
మమ్మట్లుగాచుట నఱిభాగ్యమంచు
నమ్మి, సహాయంబొనర్చిరి వారు;
దైవికంబుగ వారినావ, కరంబు
నావేళమెల్ల ఁగాఁ బోవక యున్నఁ,
బట్టినచేపలఁ బాఱవైవంగ
నెట్టునువచ్చు; కాఁబట్టి వారవుడ
యింటికై మరలిరి; యిట్లునాసుఖము
మంటఁగలియు టెల్ల వింటిరిగాదె
వాకొనుచుంటకు నాకు దైవంబు,
వేయేల?యీరీతివిశ్వంబులోన
నాయు వెక్కువపోసెనక్కటా!యివపుడు.
ప్రభు-వారికై నీవు విచారించెదిపుడు,
వారికినీకు నీవఱకును నేమి
పొసఁగెనోదయచేసి పూర్ణంబుగాఁగ
వెస వినిపింపవే వివరంబుగాను.
ఏజి-నాపిన్నకొమరుండునాప్రాణసముఁడు
పాపము! ప్రేమతోఁబదునెన్మిదేండ్ల
ప్రయంబునప్పుడు, భ్రాతనువెదక
నోయనమతిపుట్టి, సాయంబుకొఱకు,
తనరీతినే సోదరునిఁగోలుపోయి