పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/872

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కామెడీ ఆఫ్ ఎఱ్రర్సు

గావలెననుకొని, కవలపిల్లలను
బెంచితి, నాముద్దుబిడ్డలవద్ద
వంచనలేక సేవలు సేయుకొఱకు.
అట్టిబాలురు కల్గనాత్మనుప్పొంగి,
గట్టిగానింటికిఁ, గాంతాలలామ,
ప్రతిదినంబునునన్నుఁబయనంబుచేసి
వెతఁబెట్టజొచ్చెను వెడలుదమంచు;
ఇష్ట్ంబులేకయే యే నియ్యకొంటిఁ,
గష్టపడవలసి, కటకటా ! వేగ.
యానప్రాత్రంబెక్కి, యామడదూర
మానేలవిడిచి మే మరుగకమున్న,
యెప్పుడుగాలిని నెదరింప నోడు
నుప్పుసంద్రము మాదుముప్పును జాటె;
జీవింతుమనునాశ, శీఘ్రంబుగానె,
మావారివిడిపోయె; ముఱియేలయన్న,
భగవంతుఁడిచ్చిన ప్రభను మాయింప
నిగిడినమేఘము ల్నిమిషనిమిషము,
బెదరిచెదరిన మాహృదయంబులందు
నుదయింపఁజేసె సద్యోమృత్యుభీతి.
నామట్టునకు నేను సామోదముననె
యీమృతి కెట్లైన నీకొందుఁగాని
ముందువచ్చెడు నట్టిముప్పును దలఁచి
కుందెడునాలినిఁ, గులసతిఁజూచి
వివరంబు తెలియక వేడుకకొఱకుఁ