- స్త్రీపునర్వివాహ సభా నాటకము
మంచివాడుక పోయినమహిమచేత ,
నకట యాచారమె ప్రధాన మనెడువారు
ఉ . బాలవితంతు సంతతి వివాహములేక యధేష్టలీలలన్
జాలఁగ సంచరించుటను సంభవ మయ్యెడుకీడు లైనఁ దా
మేల యెరుంగలేరు ? పతిహీనలబాధలఁ జూడ వారికిన్
జాలి యొకింత పుట్టదే ? నిజంబుగ వారిని రాతిగుండెలే ?
జగː–– గీ . భ ర్తృహీనలక యికుందఫలముగలదే ? ,
దై వమీరితిఁ బతి లేనితరుణిమనుల
దుఃఖపడుఁడనిమూడుబంతులనువ్రాయ
దానిఁదప్పింపనెవ్వరితరము చెపుము.
వీరː–– గీ . అయ్యయో ! సర్వకారుణ్యఁ డయినయట్టి
యీశ్వరుఁడు స్త్రీల దు:ఖంబు నెనయుకొఱకె
యవనిమీఁదను సృజియించె నందుమేని
దై వదూషణమగుఁ గాదె తప్పకుండ ?.
క . కరుణానిధి యగుదైవము ,
ధరణీస్థలి దేనినై నఁ దఱుగనివెతలన్
బొరసెడుకొఱత సృజించునె ? ,
దురితం బగు నతనిమీఁద దోషము మోపన్ .
జగː–– ఆ. సతుల కట్టిగతులు సంప్రాప్తిమగుటకుఁ,
గారణంబతండుగాకయున్న
వేఱు హేతు వేది వివరింతువో నీవు ,
వినెదఁ జెప్పవయ్య విశదమగను
వీరː–– ఆ . నిఖలసృష్టియందు సుఖపడఁగోరుట ,
సర్వజంతువులకుసహజగుణము;