పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/856

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సరస్వతీ నారద విలాపము

గీ. వినబడెడు స్ర్తీవిలాప మీవిపినమందు?
      అహహ! మొవ్వరి దొక్కొ యీయాతక్రవము
      శ్రావ్యతర మయ్యెడును గానరసముకంటె
      ఎవ్వరయియిందు రొంటి నిట్లేడ్చువారు?
                     (ముందువంకఁజూచి)
ఉ. అక్కట ! యామె మల్లననియైనసరస్వతియట్ల యున్నదే!
      తక్కొరు లైన నిమ్మధురతాగుణ ముండునె రోదనధ్వనిన్?
      చక్కనిపాటకన్ సొగసి సర్ప మదేమెడచుట్టి యాడెడున్
      గ్రక్కునఁబోయి నే నడిగి కన్గొనువాఁడ విచారహేతువున్.

                  (చేరువకుఁబోయి)

క. ఓతల్లి! యిదె మ్రెక్కెద
     నీతనయుఁడ నారదుండ; నిక్కము చెవుమా
     చేతోవ్యధతోనీకిటు
     నాతల్లి యరణ్యరోదనంబేమిటికిన్?

            సర-(తలయెత్తి చూచి)

క.రనయా! నావలెనేయీ
    వనమున కీ విప్పుడేల వచ్చితివయ్యా?
    నిను నిటఁ గనినంత నె నా
    మనసునఁ గలకలఁక కొంత మానెం జుమ్మి.

క. నారోదనమున గల, కారణ మడిగితివి గానఁ గల తెఱఁగెల్లన్
గూరిమిపుత్రుఁడ వౌటను, గారవమునఁదెల్పు దాన ఘనమతివినుమా.

మ. రమణీయోక్తులచేత నర్ధగుణసారస్యంబు గల్పించుచుం
దమి నాయంగచయంబునన్ సహజసౌందర్యంబు పెంపొందఁగొం
చె మలంకారము లుంచి తొల్లిటికపుల్ చెష్టాచమత్కారభా
గ్యము హెచ్చించుచు దీర్ఘకాలము నమం గాపాడి రర్హ క్రియన్.