పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/841

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీతి దీపిక

నెంతసిరియుండు,నంతకునేనుమడుగు గు లడఁగియుండు;నీకయ శ్రెయస్కరంబు.

తే. తన్ను ఁదాగొప్పవానిఁగ,దలనచుట్టి కాని,చెప్పుకొనెడునట్టికాని,నరునిఁ బరిహసింతురు,చాటునఁబ్రజలు మిగులఁ; గనుక,నాత్మప్రసంశయెయనుచితంబు.

తే. మనకు లేని విద్యయు గొప్పదనము,మనకు గలదటంచునటించినఁగల్ల తెలిసి ప్రజలుమనలనవ్వుదురుచప్పుటలుగొట్టి యవిలవములేనినరుకంటెనలుసుచేసి.

తే. తనకుఁగలమేలుతోడనె తనివిపొంద, మోద మొదవును;మఱిచాలలేదటంచు మనసులోపలచింతతో వనరుచున్న, సౌఖ్యమెడఁబాయు,నిచ్చలుశ్రమముగదురు,

తే. సౌఖ్యమబ్బెడునంచు,దెసమ్ములెల్ల ఁ దిగురుఁబనిలేదు;మదిలోనఁద్రుప్తియొకటి కలిగెనేనియు,నీంటనే కలుగు సుఖఃము; తుష్టిలేదేని,సౌఖ్యంబు దొరకదెందు.

తే. ఇంతచదివితిఁజాలదె? ఇంకనేల? యనుచుఁ దనుకున్నవిద్యతోమనుజుఁడేపుడుఁ దృప్తినొందుచునుందుట,తెలివిలేమి; బ్రతికినన్నళ్ళు,విద్యను బడయవలయు.ధైర్యము.

తే.ఆపదలువచ్చినపుడు డధైర్యంబు వడిన, నంతకంతకు మఱిచింత యతిశయిల్లుఁ;