Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

వయినపక్షమున వీనుకి ప్రయోగము చేసి పోయిన వస్తువును దెప్పించెద ' నని చెప్పెను. వాడు చిన్నతనము నుండియు మిక్కిలి నమ్మకముగా బనిచేసినవా డయినందున వానికే హానియు జేయ నొడబక రాజశేఖరుడు వానిని కొలువునుండి మాత్రము తొలగించివేసిరి. వాడు తాను నిరపరాధి ననియేడ్చుచు నింటికి బోయెను. మొదట సిద్దాంతి శాస్త్రుల చెవిలో రహస్యముగా జెప్పినది చాకలి సర్వనిపేరు వ్రాయుమనియే. అతడమ్మవారిపెట్టెను దెచ్చుమిషమీద నెలుపలకు బోయి యొకకాగితపు ముక్కమీద నీరుల్లిపాయల రసముతో 'చాకలసరడ ' ని యక్షరజ్ఞానము చక్కగా లేకపోవుటచేత వా ఒత్తు పోగొట్టి వ్రాసి యాఱపెట్టి పెట్టెలో బెట్టుకొని వచ్చెను. రాజశేఖరుడుగారి కొమారుడు కాగితమును తీసికొనివచ్చినపుడు తానాపేరును వ్రాసిన కాగితమంత ముక్కను జింపుకొని తక్కిన దానినిచ్చివేసి, దానిని పెట్టెలో పెట్టినప్పుడు మార్చి మొదటి తన కాగితమును పయికిందీసెను . అదియు మునుపటి కాగితమువలెనే యున్నందున నెవ్వరు ననుమాన పడలేదు. ఆ కాగితము మీద హారతికర్పూరముతో బీజాక్షరములు వ్రాసినది యుల్లిపాయలకంపు పోవుటకే కాని మఱియొకందు నకుగాదు ; తరువాత సాంబ్రాని పొగలోను కర్పూరపు దీపము మీదను పొగచూరబెట్టుట మున్నుకనబడకుండ నున్నయక్షరములు స్పుటముగా గనబడు నట్టు చేయుటకయి కావించిన తంత్రము . ఈ ప్రకారముగా తన మంత్రప్రభావము చేత శాస్త్రులంతటి ఘసకార్యమును జేసినందునకయి వస్తువు దొరకక పోయినను రాజశేఖరుడుగా రతని కొక దోవతులచావును కట్టబెట్టి నాల్గు రూపాయల రొక్కము నిచ్చిరి. యింటికి బోయిన తరువాత హరిశాస్త్రులును సిద్ధాంతియు వానిని సమభాగంబులుగా బంచుకొనిరి .