పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/839

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నీతిదీపిక

బుస్తకంబులఁ జింపక, పొదుపుగాను
వాడుకొనుచుండుఁదనతోడివారుమెచ్చ.

తే. తనకుదీఱికయైనట్టితఱిని దినము,
       సెలవులిచ్చినదినములఁ జింతనంబు
        సేయుచును, నాటపాటల చెంతఁ బోక
       కరముప్రాఁతపాఠంబులగట్టిచేయు.
తే. చెడ్డబిడ్డలతోఁ జెల్మి. జేయఁబోఁడు;
       తల్లిదండ్రులమాటల దాఁటకుండు
        గురుని దైవంబుగానెంచి కొలువుసేయుఁ;
        జూడమనసైన, నల్లరిజాడ; జనఁడు

విద్య.

ఆ. విద్యవలన మిగుల వినయంబు గలుగును;
        విద్యచేతఁ దెలివి వి స్తరిల్లు;
        విద్యచేతఁ గరము వెలయును యోగ్యత;
        విద్యలేనివాఁడు వింతపశువు.

ఆ. ధనముతఱిఁగిపోవు దనంబుచేసిన,
        విద్య దానమునను వృద్ధినొందు;
        విత్తమరసిచూడ విద్యాధనముతోడ
         నీడ నంగఁ దగునె యించుకైన?

ఆ. చదువువేళ నీకు సందేహమేదేని
        తోఁచెనేని, మదినిదాఁచుకోక,
         గురునియొద్దకరిగి, గొబ్బుననడుగుము;
         సిగ్గుపడియె దేని, చెడుదువీవ.

ఆ. మురుగులుంగరములు ముత్యంపుపరులును
         బురుషుని గయి సేయు భూషణములె?