పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/821

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
పధికవిలాసము

ఉ. ఎత్తినగండ్రగొడ్డలియు, హింస యొనర్చెడు చుట్టువాలునున్,
రిత్తగు 'ల్యూకు ' లోహపుఁగిరీటము, 'డామియు ' నునపానునన్,
బొత్తిగ నెప్పుడున్ ధనవిభుత్వవిదూరులపొంతఁ బోక, బల్
సొత్తుగ వారికి నిడుచు శుద్ధమనస్కత బుద్ధిభక్తియున్.

ఆ.వె. హూణకవులపోక లొకయింత తెలుపంగఁ
దెలుఁగువారికొఱకుఁ దేటగాను
'గోల్డుస్మిత్త ' ను కవిగూర్చినయట్టి యీ
పధికి చరిత మేను వ్రాసినాఁడ.

క. ఒకభాషలోని సరసత
నొకభాషకుఁ దెచ్చు టెంతయును దుస్సాధ్యం
ఒకటా! నా కది శక్యమె?
సకలకవులు నాయశక్తి క్షమియింపఁదగున్.