పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/820

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
పథిక విలాసము

సీ. అచ్చోటనెంతయు నావర్తమయములౌ
వాత్య లాకసమునఁ బర్వుచుండఁ,
దనచుట్టు నెల్లెడఁ ద్రాసకరంబులౌ మృగములయార్పులు నిగుడుచుండ,
దీర్ఘ చింతాక్రాంత దేశబహిష్కృతుం డతిదుఃఖభారంబుకతన వంగి,
నిస్తులభీతిచే నిలువంగ నొల్లక
                                                         సత్యహీనుండౌటఁ జనఁగ లేక,
యెచట 'నింగ్లాండు' మహిమలు హెచ్చివెలుఁగు
నచటికిని ధీర్ఘదృష్టుల నల్లఁ బఱపి
తొడరి నాయభిప్రాయంబుతోడఁదనదు
మనసు నేకీభవింపగఁ జుమ్ము.

చ. హృదయముమందెలోన వసియించెడుసౌఖ్యము బైలఁగాంచ,నే
వెదకులుయెల్ల వ్యర్ధ మగువేసట యయ్యె బహుప్రయాసతన్;
వదలి సుఖంబు విశ్రమముఁ, బైఁ బ్రతిరాజ్యము నిచ్చుసౌఖ్యమున్
వెదకఁగ దేశ దేశములవెంబడి నేటికి సంచరించితిన్?

ఉ. త్రాసము లెల్ల రాజ్యముల రాజ్యముచేయుచునున్న, దుష్టమౌ
శాసనజాల మొండెఁ జెడు క్ష్మాపతు లొడెనుబాధ పెట్టినన్
శాసనముల్ నృపాలురు నొసంగనుమాన్పను జాలుభాగ మా
హా! సరిచూడ, నెంతయసదౌ! జనచేతము లొందునంతలోన్.

ఉ. తెల్లముగా ధరిత్రిఁ బ్రతిదేశమున్ మనమాత్మనమ్ముదం
బుల్లములోనె కన్గొనుదు మొండె సృజింపుదు మొండె నెప్పుడున్
పెల్లుగ మ్రోయుక్షోభముల వేదన నొందక గూఢరీతితో మెల్లఁగఁ బాఱుచుండు: బుడమిన్ గృహసౌఖ్య రసప్రవాహముల్.