పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/814

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
పధికవిలాసము
చ్చలు; నటుగాన వ్యర్ధమగు చక్కని టక్కుల దంభమిచ్చటన్
బలువ లొసంగ తుఇచ్ఛమగు ప్రస్తుతి కే దగగాంచు నెంతయున్

ఉ. య్చ్చట వ్యర్ధదంభము రహిన్ ముఖభంగవికార వేషమున్
గ్రచ్చఱ బూని, రాగిసరిగం దనగిండగి కంచు గూర్చెడున్
బిచ్చపుగర్వ మిచ్చటను బేర్పడ నేటుకి నిక్క విందుకై
వెచ్చ మొనర్చి , మోస మొదవించుకొనుం దననిత్యభుక్తికిన్.

క. చంచలలోకాచారము
పంచినయెడ కెల్ల బోవు స్వాంతం బెపుడున్
గొంచెంబైన గణీంపదు
మించుగ దనయంతరాత్మమెచడువిలునన్.

క. పరిగిడెడు బుద్ధి యిప్పుడు
మరిభిన్నమనస్కులైన మనుజులపైకిన్
వరవారధిగత్భమునం
దురవుగ"హాలండు" దేశమున్నట్టి యెడన్.

చ. విపులమాహార్ణవుం డడరి జెరగిలంగ బడ్డచో
జపలత బై బడన్ నిగిడుసాగరవీచుల నడ్డగింగా
నిపుడు మహోన్నతాసదృశ కృత్రిమదుర్గము లేవదీయుచో
ర్పుపసను నిల్చియున్నటులె మ్రోలను దోచెద రద్ధరాప్రజల్ .

ఉ. ఆపయి నల్లనల్ల ననయంబును రక్షణడ్యసంచయం
బేపుగ వృద్ధినొందుచు, గుయింగడు బెట్టుజగంబులోనికిన్
జాపుచు దీర్ఘబహుల , వెసంగొని రాజ్యమొకింత , వేల దా
నోపిక నాక్రమించుకొనుచున్నటు లిప్పుడు నాకు దోచెడున్.

సీ. బలిమి నిర్భంధింప బడినయట్టి సముద్రుఁ
డురుకుడ్యుపజ్కిపై నుండి నిక్కి,