పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/813

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
పధికవిలాసము
బలువిడి గ్రామమంతయును నాదుమహాద్భుత శక్తి మెచ్చుచున్
బెలుచ దివనార్ధ మాటయును విస్మృతిచెంది యొనర్చె నృత్యమున్

చ. వయసునుబట్టి భేదము లవంబును గల్లదు వృధనారులున్

రయముమెయి న్నిజార్భకుల నాట్యమొనర్పగ దెచ్చి రుబ్బునన్;
బ్రియమున సంగరాభినవిద్యకను బ్రౌఢిమ గన్న తతయున్
జయజయ యంచు గంతులిడె షష్టివయ పటుభార మగ్నతిన్.

ఉ. చింతలులేని ధన్యమగు జీవనముం బ్రకటీంచు నీక్సితుల్ ;

వింతగ వ్యర్ధకృత్యముల వీరప్రపంచము పోవు నిత్యమున్ ;
స్వాంతమునందు గౌరవమె వాంఛ మొనర్చుట నెల్లవారలున్;
సంతతమానప్రియము సల్పెడు విద్యలె మెండు వీరికిన్

ఉ. పాత్రత బట్టి వచ్చుస్తుతి పాకము లొండె ననర్హనిష్ఫల

స్తోత్రములొండె, గౌరవము చొప్పడ నిచ్చలు జెల్లునుచ్చటన్ ;
చిత్ర్ముగా బస్పరమున చేతికి జేతికి మాఱుచుండి, ప
ర్వత చరించు గౌరవమున వర్తక పుంస్రకై యమూల్యతన్.

చ. జరగు సభాళినుండి యది సైన్య నివేశ కుటీర పాళికున్

స్ధిరమతి సభ్యసింతురు స్తుతి ప్రియతం గడు నెల్లవారు, న
క్షర సుఖులట్ల కన్పడుచు, గన్పడు నట్లగునంత కెంతయుం
బరులను దన్పుచుం దనిపి, మన్నన నిత్తరు తాము గైకొనన్ .

ఉ. ఈసుకుమారవిద్య ముదమెంతగ వీరికి గల్ల జేసినన్

దోపము లుద్భవిల్లుటకు దోరముగా నెడ మిచ్చు వీరిలో ;
వేసర కన్య సంస్తుతుకె ప్రీతివహించి, సదా తదర్ధమే
యాసలుసల్పుచుంట గృశామాను మనోబల మంతయుం జెడున్.

చ. బలమఱి యాత్మయిట్లు సుభిభావము దాఁ దనలోన గానమిన్

జెలిమిని నమ్మియుండు బరచిత్తమునే స్వసుఖార్ధ మిందు ని