గీ. వైద్యులను బిల్వనంపించి వారిచేత
నౌషధంబులుచేయించి యక్కజముగ
బాధకుసహింపలేక యభాగ్యనృపుఁడు
మందుపట్టింపక శరీరమందొకింత.
క. వరుసగ మొలయునుదలయును
శిరమును గరములంనువాచి చెప్పంగఁ గవీ
శ్వరులెవ్వారును నొల్లని
మరుదశమావస్ధ నతఁడు మానకచెందె౯.
క. ధరణి నభాగ్యమహాసుర
చరితము విన్నట్టిపుణ్యచరితులకెల్ల౯
బరావనితారతిచెడునని
పరిహాసకుఁ ఢానతిచ్చెఁ బాండుసుతునకు౯.
మాలిని. అనుపమగుణసాంద్రా యాదవాంభోధిచంద్రా
జనఘననుతిపాత్రా సజ్జనాంభోజమిత్రా
వనధికృతవిహారా వల్ల్లవీచిత్తచోరా
దనుజచయవిరామా దర్పితారాతిభీమా.
గద్యము.
ఇదిశ్రీమత్సకలసుకవిజననిధేయ కందుకూరి వీరేశలింగ
నామధేయ కల్పితంబయిన యభాగ్యోపాఖ్యానంబను
హాస్యప్రబంధంబునందు సర్వంబును
నేకాశ్వాసము.
పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/795
Appearance
ఈ పుట ఆమోదించబడ్డది