పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/791

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem> అభాగ్యోపాఖ్యానము

గీ. వెలుపలికిదీసికొనివచ్చి వీపుమీద
ముఖముమీదను మెడ మీదముక్కుమీద
మణుగుగుద్దులవానలు మచ్చుచూపి
పిండిపెట్టి రభాగ్యుని నిన్ డుగాను.
గీ. దెబ్బలకుఁదాళ జాలక దితిజవరుఁడు
తిరుగబడి బండతనమునఁ దెగువచేసి
వారితోడను బోరాడ వడిగడంగ
వారలందఱు నా గ్రహావార్యవ్రుత్తి.
తటుకునఁ జుట్టుముట్టి పదతాడనకూర్పరఘట్టనంబుల౯
జిటిపొటిమొట్టికాయలను జేరల నిండిన చెంపకాయలన్
బటుతర ముష్టిఘాతములఁ బల్మఱునుంవెదచెల్లి దేహమం
తట రుధిరమ్ము గ్రమ్మఁ గఱిదైత్యుని నెఱ్ఱనివానిఁ జేసినన్.
ఉ. తాళగలేక సొమ్మసిలి దానవుడల్లనమూర్చవోవగా
బాలిక బందువుల్గని యభాగ్యుఁడు చచ్చెంటంచు నెంచి యా
భీలతఁ జాపలోపలనుబెట్టి యభాగ్యునిఁ జుట్టికట్టి దే
వాలయపూర్వ భాగమునయందలిగోతను వైచిరొక్కటన్.
క. వైచి పురంబు తలారులు
చూచిన మోసంబువచ్చుఁ జూడకయుండ౯
వేచన వలె ననిగొబ్బున
నాచంచలహ్రుదయఁ గొంచు నరిగిరివురికిన్
వ. అంత నిచ్చట.
గీ. విట్చరంబుతఱుమ వెఱచిపర్విడివచ్చి
గోతియందుదాఁగి కూరుచుండి
పందిగుంపులచట బయలనుదిరుగుచు
సునికిఁ జేసి పయికిఁజనఁగ నోడి.

<poem>