Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/787

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
అభాగ్యోపాఖ్యానము

ఉ. ఎయ్యదియూరు దీనినిభుఁడెవ్వఁడు పుట్టినవంశమెద్ది పే
    రెయ్యది మెంటిగా నిచటి కేటికివచ్చె నిటేడ్వఁగారణం
    బెయ్యది నాకుఁజెప్పఁగదవే కలరూపు కిటీంద్రయాన నీ
    వెయ్యదిగోరినన్ సరగనిచ్చెద దానినినన్నుఁగూర్చినన్.

చ. అన నదివల్కు నోజవవరా ఖరగామినిరీతిఁ జెప్పెద
        న్వినుము నుబుద్ధినాఁబరఁగునీయమభ ర్తయతండు రూపునన్
        మనసీజుగెల్పునైనఁజెలి పల్లవసంగతి యెప్డుకోరు గ్ర
        క్కునఁ బొరుగింటిపుల్లనగుకూరయుఁ దారుచిగాదె యేరికిన్.

ఉ. నిన్నటిరాత్రి యీమె యొకనీచభుజంగునిఁ గూడుచున్న చోఁ
       గ్రన్ననవచ్చి వల్లభుఁడు కన్గొని కోపముతోఁడవీఁడు నేఁ
       డిన్నడిరెయి యొంటి మనయిల్లుచొరంగ నిమిత్తమేదియో
       యున్నది యున్నయట్లు చెపుమూరకదాపక యన్నవిన్ననై.

గీ. బొంకుటకుఁజేతఁగాక యీఱంకులాడి
       నోర గుటకలు మ్రింగుచు నూరకున్నఁ
        గాంచి కోపించి యొకపెద్దకఱ్ఱతోడ
        వీపుబద్దలుగాఁగొట్టె వెలఁదినతఁడు.

ఉ. కొట్టిన మొత్తుకొంచు వడిగ్రుడ్డుల నీరొగిఁగ్రుక్కుకొంచుఁబెన్
     ఱట్టులఁ బెట్టివీధిఁబడి ఱాగతనంబునఁ బాఱివచ్చి యీ
     కట్టిఁడిఱంకులాడి తనకాపురమూడుటకోర్చి దేవళం
     బిట్టులుదూఱెఁ గన్గొనఁగ నిట్టివెయౌఁగద జారిణీగతుల్.

వ.అనికురంగగమన నవిస్తరంబుగా నామెఱుంగుబోఁడితెఱం గెఱిం
గించి తలుపుచేరి యిట్లని పిలువందొడంగె.

ఉ. డాయనుభీతిఁబొంద మగఁడా యనుఁ, దల్పులు తీయరాదె రం
     డాయనుఁ, బల్కవేమి చెవుడాయను సొమ్ములువెట్టు ఱంకుముం