ఈ పుట ఆమోదించబడ్డది
అభాగ్యోపాఖ్యానము
<poem>:ఉ. దీనిని నేను వేడిననూ దిట్టునో కొట్టునో లోని కేగునో
- మానినిఁ బల్మి బట్టుటయు మంచిదిగాదని యూరకుండి నే
- నూనశరార్తి నెక్కరణి స్రుక్కుదు నేవిధినై నిప్పుడీ
- చానను గూడువాడనని జప్పుడు సేయక మెల్ల మెల్లగాన్.
- చ. వెనుకకు వచ్చి చేయొడిసి వేగనుబట్టిన లేచిదానవుల్
- గనుఁగొని కొమ్మ తానెడమ కాలున ముందరిపండ్ల్లురాలఁ దా
- చినదగనోర్చి నెచ్చెలియు చ్చీయన వెండియు గౌగిలింపజూ
- చినఁ జెలి భీతి గర్భగుడిచేరెను దల్పులువైచి గొబ్బునన్.
- ఉ. అంతట దైత్యుడుం దలుపుబల్లనగుద్దుచు నిన్నుఁ గూడ కొ
- క్కింతయుఁ దాళలేననుచు నేడ్చుచులబ్బున మొత్తుకొంచు మి
- న్నంతయుగూలి పై బడినయట్లు వితాకునగూరు చుండ నా
- చెంతకు దార్పుకత్తెయొకచేడియ వచ్చె మెలంతనారయన్.
- గీ. వచ్చి గుడిచెంతఁగూర్చున్న వారిఁగాంచి
- మీరు ర క్తవర్ణాలక సై రిభాంగి
- మర్కటానన పర్వతమధ్యభార
- వనితనెందైనఁ గంటిరేయనుచునడుగ.
- ఉ. దానివభ ర్తవల్కు వనితా వినుమిచ్చిటి కేను వేఁటకై
- నేనలఁ గూడివచ్చి గుడిచెంగట నేడ్చుచునున్న దాని నీ
- వానితియిడ్డలక్షములన్నియుఁ గల్గినదాని నొక్కకీ
- శాననఁగాంచి కేలొకటనంటీన నీగుడిచూఱె నివ్వఱన్.
- ఉ. ఆకనుదోయిసూక్ష్మతయు నాచనుతిత్తులమార్దవంబు నా
- మైకటినత్వసంపదయు మానిని నేఁ గనుఁగొన్నయంత నే
- సూకరగాత్రిపై మనసుసొచ్చెను నిక్కువమెట్టులైన నా
- కాకవీవక్తఁ గూరిచి రయంబున నేలుము నీకుఁమెుక్కెదన్.
<poem>