పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/778

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గీ. చేరినిల్చిన నంటయిల్ చేరినిల్చుఁ | గానవచ్చినఁ బరువెత్తి కానసొచ్చు డంబుమీఱిన భటసమూహంబుతోడ | సాటియౌదురె మాననకోటినెవరు. ౧౫

గీ. వీటఁగల్గిన ఘోటక కోటితోడ | నిలిచిప్రాఁకంగ నేరక నీరుసొచ్చె వెఱచి తాఁబేటిగుంపులు వేయునేల ; పురినిబుట్టిన సుక్కైనఁబుచ్చిపోవు. ౧౬

చ. దనుజులు మర్య్తులందునిమి తత్తనుమాంసము మెక్కి పోవఁగా నెనసి పురంబునల్గడల నెమ్ములరాసులు భూధరంబుల ట్లనుపమలీలనుండఁ బ్రమథావళితోడ మనోజవైరి యా మనికికి వెండికొండయని మాటికివచ్చుఁ బరిభ్రమమింపుచున్. ౧౭

ఉ. కొంపలమీఁదితుక్కెగరఁగొట్టుకుపోవఁగఁ దూముకాల్వలోఁ గంపునుగూడి తోఁటలనుగల్గిన కుక్కపొగాకుచెట్లబల్ గుంపులవాసనంగలిగి కుప్పలు నిప్పులు రాల వేఁడిలో ముంపుచు వాయువుల్ పొలయు ముక్కునవెండ్రుకలలెల్లమాడఁగన్. ౧౮

ఉ. అంగన లూర మెల్లఁ జనునప్పుడు కూడెదమంచు లేళ్ళుఁ జి వ్వంగులుఁజేరి యోటువడువారినిఁ గెల్చినవారు మ్రింగఁగాఁ బొంగుచుఁబన్నిదంబడఁచి పోవఁగ జాలక లేడులో డెఁజి వ్వంగులు గెల్చెఁ గానియెడ వానికి లేళ్ళనుజంపనేటికిన్. ౧౯

ఉ. ఆపురమేలు రాక్షసమహాకులవారిధి బాడబుండు, కా శీ పురనాథవిష్ణుసరసీరుహసంభవపాదభక్తసం తాపకరుండు, పుణ్యవసుధాధర వజ్రధరుండు, ప్రోల్లస త్పాపధనంజయానిలుఁడు, దానవుఁ డొక్కఁ డభాగ్యనాముడై. ౨౦