పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/777

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చ. తనపలుముండ్లవాఁడిమిని దప్పక వాసవువజ్రమున్ జయిం

    ప నతిదృఢంపుమట్ట లను మైమఱువొప్పఁగనేగి ముండ్లచే
    ననిఁ గులిశంబు గెల్చి తనకడ్డగు వేల్పులకండలొల్చి తా
    నొనరెననంగ బ్రహ్మజెము డొప్పగు నెఱ్ఱనిపండ్లగుంపుతోన్. ౧౧

చ. పురిఁదగుఁ జుట్టునుంగదిసి భూరిభయంకరలీల దట్టమై

    పెరిఁగినగచ్చపెన్‍బొదలు పెట్టనికోటగ లోనియీతచాల్
    బురుజులుగాఁగ, దాపునను బొల్చినతుమ్ములు పెద్దముండ్లతో
    సురియలుదూసి నద్భటులు స్రుక్కక కావలిగాచుతీరుగాన్.

సీ. మార్దవం బంగ నామణులచన్నులయంద సాహసంబాహారసమయమంద ౧౨ ప్రజ్ఞయంతయును దంభములు కొట్టుటయంద బంటుతనము వంటయింటియంద మితభాషణము శాస్త్రతతులచర్చలయంద కలిమి పురంద్రులకౌనులంద నిలుకడ నెలఁతల నేత్రయుగ్మములంద ధైర్యంబు పెద్దలఁదఱముటంద వడి లతాంగుల వంకరెనడలయంద | శాంతి యెంతయు దుష్కర్మసహనమంద కానిమఱియెందువెదకినఁ గానరాద | నంగఁ దద్దయు నాపట్టణమువెలుంగు. ౧౩

గీ. తివిరిపాప పుంజంబు మూర్తీభవించి నచ్చిగుమిగూడి ప్రోల్చొరఁబాఱుకరణిఁ బందిగున్నలు చెరలాడు సందులందు | దున్నపోతులకైవడిఁ జెన్నుమీఱి. ౧౪