పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/776

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సీ. వెలయాలినింటనె నిడియించి దానిచేఁ
దిట్లునుదన్నులుఁ దినెడువారు
తల్లిపోయిననాఁడు దానింట నేయుండి
పనియున్నది దెవత్తున నెడివారు
కన్నెఱికము చేయు కార్యంబునకుఁ బూర్వులార్జించుమాన్యమ్ములమ్మువారు
భోగకాంతలుగాక పొరుగువారల భార్య
లనుజేరి సౌఖ్యంబుగ నెడువారు

విలువసారాయిసీసాలకొలఁదిఁద్రావి
 యొడలు దెలియక వీధులఁబ డెడువారు
నగుచుమర్యాదలనుగాంతు రనవరతము । బ్రాహ్మణోత్తములాదివ్యపట్టణమున. ౭.

చ. కురుబలముం గనుంగొనుచుఁ గోటితురంగ జవంబుతోడ ను
త్తరుఁ డరదంబుడిగ్గి పురితట్టునఁ బాఱియుఁ గ్రీడిప్రేరణన్
మరలఁగఁ బోరికేగుటకు నవ్వుచు నుందురు పోటుబంటులై
పిఱికితనంబునం బురిని బేరువహించిన రాజపుంగవుల్. ౮

గీ. బియ్యమున వడ్లు బెడ్డలు పెక్కుగలిపి
నేతిలో వంటిపండ్లను నెఱయఁబిసికి
తప్పుతూనిక తూచుచుఁ దక్కువగను
గొలుచుచును గోమటులు సొమ్ముఁగూర్చుకొండ్రు. ౯

గీ. కూట సాక్ష్యంబు బ్రాహ్మణగురువలన |
 బాగుగా నేర్చుకొని పాటుపడుటమఱచి
జూదములదొంగతనముల శూరులగుచు ;
శోభఁగాంతురు పురిలోన శూద్రజనులు. ౧౦