పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/775

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అభాగ్యోపాఖ్యానము.

హాస్య ప్రబంధము.


క. శ్రీరమణీహృల్లోలా | కారుణ్యలతాలవాల కాంచనచేలా
   ఘోరాహవజయశీలా । శ్రీరాజమహేంద్రవరపురీగోపాలా . ౧

వ. భవదీయికరుణాకటాక్ష వీక్షాసమాసాదిత సరసకవిత్వ పటుత్వంబుపెంపున నేఁగల్పింపంబూనిన హాస్యరసప్రధానంబగు నభాగ్యోపాఖ్యానంబునకుఁ గథాక్రమం బెట్టిదనిన. ౨

క. అడవులలోఁగడునిడుమలు ।
గుడుచుచుధర్మాత్మజుండు కొందలపడఁగన్
వడిఁ బరిహాసకుఁడొకఁడ |
య్యెడకునుజనుదెంచి మ్రొక్కి యీకథచెప్పెన్ ౩

గీ. వింధ్యధాత్రీధరప్రాంత వంధ్యభూమి । జలములేనట్టి యొకపాడుకొలనుదరిని
దండకారణ్యమధ్యంబుఁ దనరఁజేయుఁ ।
బాపసదనంబు వ్యాఘ్రాఖ్య పట్టణంబు.

క. ఆపురము లచ్చియప్పకుఁ ।
గాపురము, జగంబులందుఁ గలపురములలోఁ
గాపురము, పాపనమితికి ।
దాపురము, మహాపురమలదానవతతికిన్ . ౫

క. అన్నగరంబునఁ గరమ ।
భ్యున్న తివహియించుకుజనపుంగవకౌటి
ల్యోన్నతి కోడుటఁ గాదే ।
పన్నగకులమెల్లఁ జేరెఁ బాతాళంబున్ . ౬