పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/770

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రోత్తర రామాయణము

క . కని వేనవేల తెఱఁగులఁ,
గనికం మెదఁబుట్ట నోటికసితీఱంగా
మనయాగడంబు లెల్లను,
మనవి యొనర్చుట నటుపయి మముమీబంట్లన్ .

<poem> క .నిలువంగనీయ రెందును,
బలియురురక్కసులు వారిబారికి మమ్ముం
దొలఁగించి యేలకుండినఁ,
గలరేయందైన మాకు గాదిలిచుట్టల్ .

చ . అనిమొఱవెట్టఁ జొచ్చిరట యాపయి నౌదలయూచి యాతఁడున్
గనికర ముప్పతిల్ల గడకంటనుగంగొని వారిఁగూల్పఁగా
వినుఁడిదె యున్నరూపు వినిపించెద నోపనునేనువెన్నునిం
గనుఁడతఁడయ్యేనేని మిముఁగావఁగ జాలినవాఁడు పోడిమిన్ .

గీ . అనుచునానతియిడెనఁట యాపలుకులు ,
చెవినివేసుకొని పసిండిచేలవానిఁ
గావఁగాబోయి ఁమొక్కులువేనవేలు ,
సలిపివిన్న వించిరఁటపై చందమునునే .

మత్తకోకిల . అంతటం గరివేల్పు వారలయందుఁ బ్రేముడిమీఱఁగా
నెఁతకై ననునేను గల్గఁగ నేల నొవ్వఁగ మీకికన్
ద్రుంతు రక్కసిఱేండ్ల మువ్వురదొడ్డతూవుల వ్రేల్మిడిన్
వంతలేటికిఁ బొడుగీములవంక నందఱునెమ్మితోన్ .

క . అనివీడుకొల్ప వెల్వడి,
కనుసైగలుచేసికొంచుఁ గై దండలతో ఁ
బెనుసందడి సేయుచు వే ,
చనిరఁట యావేల్పులెదల సంతసమారన్ .