పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఐదవ ప్రకరణము

బెట్టిన కంచరి దుకాణములను పండ్లయంగళ్ళను దాఁటి, మెట్ల పొడుగునను ప్రక్కలయందు బట్టలు పఱచుచు కూరుచున్న వికలాంగులకు సెనగపప్పును గవ్వలునువిసరివైచుచు, కాశికావళ్ళు ముందుపెట్టుకొని పుణ్యాత్ములను పాపాత్ములను స్వర్గమును నరకమును జూపెదమని పటములు చేతఁబెట్టుకొని వచ్చెడివారిని పోయెడివారిని నడ్డగించెడు కపట యాత్రికులకు తొలఁగుచు, కొండయెక్కి దేవతాసందర్శనార్ధము వెళ్ళెను. అక్కడ నిసుకుచల్లిన రాలకుండు మూఁకలో నుండి బలముగలవారు దేవునకుఁ బండ్లయ్యవలె ననునపేక్షతో దూఱి సందడిలోఁ బడి దేవతాదర్శన మటుండఁగా మందిలోనుండి యీవలంబడినఁ జాలునని నడుమనుండియే మరల యీవలకువచ్చి సంతోషించు చుండిరి. వారికంటెబలవంతులయినవారు గర్భాలయము వఱకును బోయి పండ్లను డబ్బును పూజారి చేతిలోఁబెట్టియీవలఁ బడుచుండిరి. అర్చకులును ఒకరు విడిచి యొకరు వెలుపలికివచ్చి చెమటచేఁదడిసిన బట్టలను పిండుకొని వెలుపలగాలిలో కొంతసేపు హాయిగానుండి మరల గర్భాలయములోఁ బ్రవేశించి యాయుక్కలో బాధపడుచుండిరి. ఈప్రకారముగా వచ్చినయర్చకులలో నొకఁడు మాణిక్యాంబను జూచి యామెచేతిలోనిపండ్లను బుచ్చుకొని లోపలికిఁబోయిస్వామికి నివేదనచేసి వానిలోఁగొన్నిపండ్లను తులసి దళములను మరలఁ దెచ్చియిచ్చి యందఱశిరస్సుల మీఁదను శఠగోపమునుంచెను. అంతట మాణిక్యాంబ వెనుకకుతిరిగి యాలయ ద్వారమును దాఁటుచుండెను.రుక్మిణి యామెచెఱఁగు పట్టుకొని వెనుక నిలుచుండెను. ఒక ప్రక్క సీతయుమఱియొకప్రక్క నొకముత్తైదువయు నిలువఁబడిరి. ఆ సమయములో నెవ్వడో వెనుకనుండి రుక్మిణి మెడలోనికి చేయి పోనిచ్చి కాసుల పేరును పుటుక్కున