పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/769

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

క . అని విన్నఁదనము తోఁపఁ ,
మనవి యొనర్పంగ వారి మన్ననతోడం
గనుఁగొని వెన్నుం డిట్లని ,
కనికరమున నానతిచ్చెఁ గరఁ గినమదితోన్ .

చ .ఎఱుఁగుదు రక్కసు ల్నలువయిచ్చినమప్పుల నొప్పుమీరి పల్
తెఱఁగుల మిమ్ము నొంచుటయు ఁ దీఱనిదూఱడి కోర్వలేక యం
దఱు మలవిల్తుఁ గొల్చుటయు నంగర నాతఁడు మిమ్ముఁ బుచ్చు టే
నెఱఁగుదు వేల్పులార వనుఁ డిండ్లకు వారలరూపు మాపెదన్ .

క . అమ్ములవానలు గురియుచు,
నెమ్ములు విఱుగంగ మొ త్తియొవ రడ్డయినన్
నమ్ముఁడు జముకడ కనిచెద .
నిమ్ములనుండుండు మీర లెల్లరునింకన్ .

గీ . అట్టిరకమును గనికరముట్టిపడెను .
వెన్నుపలుకులు వీనులవిందుగొలుప
నెదలఁ బొదలెడునుదిలల వదలికదలి ,
యిమ్ములకు నేగి రిమ్ముల నెల్లవారు .

గీ . అట్లుజేజేలు తమయిండ్లకరిగినంత ,
నంతయును వేగరులుతెల్ప నాలకించి
మాల్యవంతుఁడుతమ్ములమంతనమునఁ ,
బిలువగానంపియొరులకుఁ దెలియకుండ .

గీ . తగవుదోఁపంగ నిట్లనెఁదమ్ములార ,
వినరుగా నేటిప్రొద్దొక వింతవింటి
వెరచి మొన్న నీనడుమను వేల్పులేమొ ,
గట్టువిల్కానియొద్దకు నట్టెయేగి .