పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/768

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రోత్తర రామాయణము

యెంచ నరియెంత మా కని యించుకైన
లెక్కసేయరు మాటలు పెక్కులేల .

గీ .పమిచెప్పుకొనుదుము మాసామి నీకు
వారు పఱచెడునొఱపుల వనరునొప్పు
డెంతొ దోసంబుచేయువా రిట్టివేల్పు
బ్రదుకుఁ జెందుదురనియెంతుమెదలలోన .

గీ . ఇచ్చ మానుషులను జూడ ముచ్చటగును ,
జావుగలిగినవారలచంద మరసి
యేలొకోతాను గలిగింపఁ జాలఁడయ్యెఁ
జావు మాకని నలువపై నేవవడము .

సీ .బెడిదంబుగాఁ గేల వడిదంబు పూనిన
                                మేటిరక్కసులకుఁ జేటు మూఁడు
బిగివింటి నొగివంటి తెగనిండఁ దీసింన
                               బిరుదుదందలు కేండ్లు వేయు నిండుఁ
బులుఁగుతత్తడి నెక్కి పొలికలనికి నేగ
                              నొప్పనివారలయుసుఱు లేగు
నెదలోనఁగన లూని యించుక చూచినఁ
                            గానివారలపిండు గం డడంగు

బటువుకై దువు తనరార దిటముమీఱ ,
బంటులను గాచుపని పూని వచ్చితేని
తలఁక కెవ్వాఁడు చివ్వకు నిలుచువాఁడు
జాలమేలను గై గొమ్ముసరగమమ్ము .