పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/765

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ప్రథమాశ్వాసము

క. ముక్కంటి న్వీడ్కొని వా
రొక్కట నెలికొండ వెడలి యొండొరుఁ గనుచున్
మిక్కిలి పొంగి చెలంగెడి
యక్కడిపాల్కడలిఁ గాంచి యం దొకదీవిన్.

క. కడలికిఁ దొడవనఁగాఁ గడు
బెడఁగగునొకవీడు చూచి పెంపుగ దానిన్
దడ వబ్బురపడి చూచుచు
నెడనెడఁ గలవింత లెల్ల్ల నేర్పడఁ దమలోన్.
 
గీ. చెప్పి మెచ్చుచు నొక్కింతసేపు మసలి
యొక్క చక్కని జక్కని చెక్కడంపుఁ
బనులఁ జెలువొందు పొగడొదుపసిఁడి కోటఁ
గనులవిందుగఁ బొండగాంచి కనఁ దలంచి.

గీ. చొచ్చి యచ్చంపుఁ బచ్చల మెచ్చు హెచ్చు
కట్టడపుఁ ద్రోవక్రేవల బిట్ట నడచి
యవల మగరాలజిగి చాల నలమ నలరు
తళుకు లీనెడు వెన్ను ని నెలవుచేరి.

సీ. పొంగారు బంగారురంగుకంబంబులఁ
                         జలువచప్పరములు చెలువునింప
సరమించు సిరిగంచు సరిగంచుటందంపుఁ
                          జందువామిసమిసల్ చౌకళింప
వగఁగ్రాలుపగడాల మొరాల గుంపుల
                          కెంపులు క్రేవలఁ గ్రేళ్ళుదాఁట
మెఱఁగూని దొరలేని నెఱమానికపుఁబెద్ద
                          గద్దెలనిగ్గులు గండుమిగుల.