పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

ముగా బ్రకాశింప, కొప్పులోని కమ్మపూవులతావి కడలకు బరిమళము లెనంగుచు గంధవహుని సార్ధకనాముని జేయ నడచివచ్చి వీధిలో నొక యరుగుచెంత నిలుచుండి రధమువంక జూచుచుండెను. ఈదేశములో సాధారణముగా స్త్రీలు తమభర్తలు గ్రామమున లేనప్పుడు విలివచీరలు కట్టుకొని యలంకరించుకొనుట దూష్యముగా చెంచువా రయినను, యితరులయింట జరుగుశుభ కార్యములయందు పేరంటమునకు వెళ్ళునప్పుడు గాని గ్రామములో జరిగెడి స్వామికళ్యాణ మహోత్సవమును గ్రామదేవతల తీర్ధములును జూడబోవునప్పుడు గాని యెరుపుతెచ్చుకొనియైన మంచిబట్టలను మంచినగలను ధరించుకొనక మానరు. అప్పటి యామె సౌందర్యమునేమని చెప్పుదును ! నిడుదలై సోగ లైనకన్నులకు గాటుకరేఖలొకసొగసు నింప, లేనవ్వుమిషమున నర్ధచంద్రుని బరిహసించు నెన్నుదురున బలచంద్రుని యకృతినున్న కుమ్మబొట్టు ర్ంగు లీన శృగారరస మొలికెడి యా ముద్దు మొగము యొక్క యప్పటి యొప్పిదము కన్నులకఱవు తీఱ జూచి తీఱవలిసినదే కాని చెప్పితీఱదు. రధ మామె దృష్టిపధమును దాటి పోయినతోడనే ద్వాదశోర్ధ్వవుండృములను దిట్టముగా ధరియించి దానరులు ఇనుప దీపస్తంభములలో దీపములు వెలిగించుకొని నడుమునకు బట్టు వస్త్రములను బిగించుకొని యొకచేతితో నెమలికుంచె యాడించుచు రెండవచేతిలోని గుడ్డచుట్టలు చమురులో ముంచి వెలిగించి సెగ పోకకుండ నేర్పుతో దేహమునిండ నంటించుకొనుచు ప్రజలిచ్చు డబ్బులను దీపస్తంభముల మట్లలో వేయుచు నదిచిరి. ఆ సందడి యడిగినతోడనే రుక్మిణీ తల్లియు మఱికొందఱును తోడనడువ బయలు దేఱి ఉత్సవమునిమిత్తమయి పొరుగూళ్ల నుండివచ్చిగిడారములలో