పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/758

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
శుద్ధాంధ్రోత్తర రామాయణము


దడవు దీవించి మించినె త్తమ్మిచూలి
కదలివిదారిఁ దనవారిఁగలసిచనియె. 159
 
వ.అంత 160

ఉ. వేలుపుఁబెద్ద తానిడినవిప్పగు మెప్పులనొప్పుమీఱి తొ
       ల్వేలుపుఁబెద్ద లొక్కమొగి విక్కుచు నిక్కుచుఁ గండ్రక్రొవ్వునన్
        వేలుపు యొనర్చి గెలిచి వీరిని వారిని బోలె వారల౯
      గేలి యొనర్చి పేర్చి పెనుకిన మెయిం జెఱఁ బెట్టి రింతుల౯. 161

క. పొడిచిరి పెక్కుర జక్కుల,
       జడదారులఁ గాళ్ల రాచి చమరిరి నేలన్
       గడతేర్చిరి చిలువల నొక,
       కడకుం దెచ్చి పొగ రెచ్చి కలఁచిరి జగముల్. 162
 
గీ. వారు పెట్టెడిరట్టడిఁ బడఁగ లేక
      యిండ్లు వాంకిడ్లు విడనాడి యెదల నోడి
      కన్నకన్నవారల నెల్లఁగాళ్ళువట్టి
       వట్టియనదలై వెల్పులు కట్టువడిరి. 163

సీ. ఒక వాడమొకమోడకొకవేల్పుఁ గొట్టింతు
                                                  రొకవంకజములెకనొడిసిచఱతు
      రొక్కచక్కీపొకరెక్కియొడయండ్లఁబట్టింతు
                                                  రికచాయఁదొగదాయనొదుగనడఁతు
      రొకదారిజడదారి నొఱపులఁబెట్టింతు
                                                   రొకచెంతనెలనింతయుక్కడంతు
      రొకమేల వినుచూలి నూరక కట్టింతు
                                                    రొకదండ జము నుండనోలిఁ బంతు