క. జగములఁ బుట్టింపనుముఱి
నెగడింపను గినుకఁబూని నీల్గింపను మే
లిగఁ దగునెఱప్రోడపు నీ
వెగదా నెత్తమ్మిచూలి వేలుపుఁబెద్దా. 154
క. జతలేనిసిరులఁ దగి నీ
మతకము తెలియంగ లేక మైదాల్పు లొడల్
సతమని నమ్మ కరమ్మను
వెతలం బడి పొరలు చుండ్రు వెఱ్ఱులపగిదిన్. 155
శా. ఎందు న్మీసరి పోల్పఁగాఁ దగినవే ల్పెన్నంగ నొండొక్కఁడీ
యందంబై నజగంబులోపలఁ గలండా పేర్కొన్న న్నెమ్మి మి
మ్ముం దోరంబుగ నమ్మి వేఁడుకొనుటల్ ముంగొగుబంగారుగా
ముందు నిందుము నేడు మా కది నిజంబుం జేసి తీ వియ్యెడ౯ 156
క.మాపై ఁ గనికర మొలయఁగ
మాపూంకికి మెచ్చి మమ్ము మన్నింపంగా
నోపెదవేని నేఁడెద
మాపయి మామేలును దమయక్కటికంబు౯. 157
క. కదదొరలను బవరంబుల
నొడువం గలబల్మి మాకు నొందొరులపయిన్
విడవని కూర్మియు సిరులను
నెడపక వేలుపుల వేల్ప యిప్పింపగడే. 158
గీ. అనుచుఁగొనియాడితను వేఁడఁగనికరమునఁ
గోరికలనిచ్చిలలిమెచ్చికూర్మిపేర్మిఁ
పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/757
Jump to navigation
Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు
