ఉ.దానికిఁ దాళఁజాలక వెతందెఱగంటులు దద్దరిల్లి లో
నూనిననివ్వెఱంగదలి యూడనిబాడిరి తమ్మిచూలికిం
బానలు దీఱ రక్కసులప్రల్ల దనంబులు విన్నవింపఁగాఁ
బూని కడంకదోఁప నటమున్నె యతండును
నిండువేడుకన్. 148
ఉ.అంచహుమాయిఒ నెక్కి తెలియందవు ఱెక్కలడాలు నల్గడల్
ముంచు కొనంగఁ గెంపుడుజిగు మిక్కు మెఱుంగులు చౌకళించి మే
ల్గాంచిన జాళువాబొమిడి కంబులడంబగు మానికంపుఁగ్రొ
మ్మించులతో మాఱ్మలయ మింటనువచ్చెను వారిపజ్జకున్. 149
క. విచ్చేసి వారిమేనులు
మచ్చికతోఁ గేలనిమిరి మదితాల్మికిలో
నచ్చెరువందుచు దీవన
లిచ్చి కనికరంబు దోఁపని ట్లని పలికెన్. 150
ఉ.రక్కసులార చేరువకు రండీదె వచ్చితి మిమ్ముఁ జేరఁగా
నిక్కరణి ంవెతల్ గుడువ నేటికి మికిఁక లెండు తాల్మికి
న్నిక్కముగాఁగ డెందమున నేఁగడుమెచ్చితి మీపయిం గరం
బక్కటికంబు విట్టెనిపు డారెసి కోరుఁడు కోర్కు లిచ్చెదన్. 151
క.అని పలుకులవెలఁదుక చ
క్కని మేలిమియుం దెరవలిఁ గైకొననియెలిం
గునఁ దిలివే ల్పానతి యి
చ్చిన విని వడి లేచి వచ్చి చిడిముడితోడ౯. 152
చ. అలవలకేల నల్వ యొడ లంటిన వెంతనె యట్టె తొంటియా
యలసట వాసివాసిగని యారెయిద్రిమ్మరు లొక్కయుమ్మడిం
బలుకులఁ దేనియల్ దొలుకఁబాఱఁగఁ గేల్గవ దోయిలించి యి
చ్చలఁదొలివేలుపుఁ బిగడఁజాఁగిరి కన్నులు విచ్చి యచ్చట౯. 153
పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/756
Appearance
ఈ పుట ఆమోదించబడ్డది