పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/751

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

గీ. తల్లిదండ్రులకన్నులు చల్లఁపడగ
        విద్దెములు చేనె కొన్నాళ్ళు వెనుక వెనుకఁ
        దప్పుటడగులు పెట్టుచుఁ దడవు నడచెఁ
       బిదప జిలిబిలి పలుకులఁ బిలువనేర్చె.

క. అట్లుముద్దులు గురియుచు నలరిఁజిన్ని
         తనముమెల్లనజాఱిజవ్వనము మొలిచెఁ
         జిన్నిపాయంపు మేనికి వన్నెయొసఁగి
          కుందనంబును నెత్తావిపొందినట్లు.

గీ. వెడఁదఱొమ్మున కొకవింతవీఁకయొదవె
          నగుమొగంబున నొకవింతజిగిదొలంకె
          మీపకట్టున కొకవింతమిసిమితోఁచె
          హేతిపట్టికి జవ్వనమింపుమెఱయ.

క. అప్పగిదిముద్దుకొమరుని
          యొప్పునకుం దగినయట్టియొయ్యారినిదాఁ
          దప్పక పెండిలి సేయగ
          నప్పుడుతలపోసి హేతియందఱు మెచ్చ౯.

సీ. కవజక్కవలఁబోలి తొవపెక్కువలనేలి
                                                చన్నులు కన్నులు చెన్నుమీఱ
               జిగిహొన్నువలెమించి తగమిన్నుఁదులకిం చి
                                        మేనును గౌనును జానుమీఱ
                నిరులసొంపునుమీఱి తరగగుంపును దూఱి
                                         కురులను దరులును గొమరుమీఱ
                   నరఁటాకుఁగని నవ్వి మరుబాకులను రువ్వి
                                               వీపునుజూపును వింతమీఱఁ