పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఐదవ ప్రకరణము

నెగిరెగిరిపడుచు లక్కతలకాయల ద్రిప్పుచుండిరి . అప్పుడు పూజారులు పల్లకిలో నుత్సవవిగ్రహముల నెక్కించుకొని వాద్యములతో గొండదిగివచ్చి రధమునకు మూడు ప్రదక్షణములను జేయించి స్వామి నందు వేంచేయింపజేసిరి. చెంతలనున్నవరందఱును క్రిందనుండి యరటిపండ్లతో స్వామిని గొట్టుచుండగా రధముమీద, గూర్చున్న యర్చకులును తదితరులను చేతులతో దెలు తగులకుండ గాచు కొనుచు నడుమనడుమ జేగంటలు వయించుచు గోవిందా యని కేకలు వేయచుండిరి. ఆ కేకలతో రధమునకు గట్టియున్న మ్రోకులను వందలకొలది మనుష్యులు పట్టుకొని యిండ్ల కప్పులు వీధి యరుగులును కూలునట్ట్టుగా రధమునీడ్చుచుండిరి. అంతట బోగముమేళ యొకటి రధమునకు ముందు దూరముగా నిలువబడి మద్దెలమీద జేయివైచుకొని యొకటే యాడసాగెను. మద్దెలమీద దెబ్బ వినబడినతోడనే దేవునితో నున్న పెద్దమనుష్యులందఱును మూకలను త్రోచుకొనుచు వెళ్లి యాటక త్తియలముందు మున్నున్నవారిని వెనుకకు పంపి తాము పెద్దలయి యుత్సవమునందు గానవినోదమనకు కొఱత రాకుండ సమర్ధించుచుండిరి .


అప్పుడు రుక్మిణి సమస్తాభరణభూషితురాలయి ఉమ్మెత్త పువ్వువలె నందమై బెడబెడలాడుచున్న కుచ్చిళ్ళు మీగాళ్లపై నొఱయ, ఎడమ భుజము మీదనుండి వచ్చి జరీచెట్లుగల సరిగంచు పయ్యెదకొంగు వీపున జీరాడ కట్టుకొన్న గువ్వకన్నద్దిన నల్లచీర యామె యందమున కొక వింతయందమును గలిగింప , కాళ్ల యందియలును, పాంజేబులును, గళ్ళుగళ్ళున శ్ర్యావ్యనాదము చేయ , కుడుచేయితప్ప గడమభాగ మంతయు బయిటలో డాగి కనబడకయున్న వ్ంగపండుచాయగల గుత్తపుపట్టురైక నీరెండెలో ద్విగుణ