పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/749

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రధమా శ్వాసము

ఉ . విందునుముందు, వెండీ యొకవింతగ రావణుకన్న మున్ను లం
         కందగ బెక్కురక్కనులు గ్రాలిరంటిరి వారిపేళ్లు నా
        యందఱివంగడంబు మును పాకఱివేల్పున కోడీ డాగుటల్
       సందియమాఱ దెల్పగదె సొగిలి మొక్కెదనీకు నావుడున్
                                          పంచ చామరము
         అగస్త్యుడంత జెల్వుగుల్క నందమొల్కు పల్కులం
        బొగడ్తజేసి వాసి రాముమోము గోము మోఱగా
         జగానిగార పోరచూపు జాలువాఱ జూచి డం
        బుగా నెలుంగు కంగుమంచు మోగ వేగనిట్లనుక్

మ. తొలుత నెన్నునిబొడ్దుదమ్మి నెలమిం దొల్వేల్పు తాబుట్తియ
         వ్వల మున్నీరొనరించి దాని గొని కాపొడంగ మేదాల్పులం
        గలిగింపం దరువాత వారలతనిక్ సంతోస మారంగ మా
        వలనం గల్గినకర్జ మేమి వినిసింపంజెల్లు నా నాతడున్

 క. మిమ్మిందఱ గలిగించితి
         నిమ్ముల నిన్నీరుప్రోవ నిప్పడ చని మో
         నెమ్మదులమ్ము దలపుచు
        నెమ్మెయి గాచెదరొ చూతమిందఱిబలముల్

క. అనిపనిచిన వల్లేయని
          పనివిని మున్నీరు గాచువని పూని కడుం
          గనుకలిగియుండి యాకలి
          గొనిడప్పికి నిలువలేక క్రోలుద మనుచున్

క. తలపోసి యంతబొంతను
          నలుమోములవేల్పు గాంచి నక్కుచు దమలో
         వెలవెలబాఱుచు మిక్కిలి
        యలసియు నీరానగొంకి యడకునతోపన్