పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/748

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రోత్తర రామాయణము


గలికిపడగంవుసోరణగండ్లు రేలు
తొవలవిందున కేగంగ ద్రోవమాప
వీడు తొలివేల్పుగములకై విశ్వకర్మ
లంకయను పేరజేసె నాలంకయందు.

క.వెన్నునికి వెఱచి పాఱిరి
మున్నట నున్నట్టివారు మొన్నను నివుడా
సన్న యఱింగితి గావున
నన్నా నీవేగియుండు మచ్చట నెమ్మి.

క.క్రిందిజగమ్ముననిలిచిరి
యందలి రేద్రిమ్మరీండ్లు నచ్చట నీ కే
తొందరయు గలుగనేరదు
వందడిచూపంగ లేరు జంకక పగరు.

చ.అని నెలవియ్య నప్పలుకు లవ్ దల దాల్చికుబేరు డప్పుడే
చనిచని లంక జేరి పలుచందములం దను దారవంబుతో
ననయము వేల్పుపిండు గొనియాడగ నేలుచునుండ పుష్పకం
బొనరగ నెక్కివచ్చి కనుచుండును నిచ్చలు దల్లిదండ్రులన్.

క.అని రారాజు తెఱంగిటు
వినిపింపగ రాముడలరి వింతగ మది దో
చననచ్చెరువంది యగ
స్త్యునిగని యిట్లనియె వేడ్క దుడుకొనరింప.

ఉ. ఓజడ దారిరాయ యివుడుల్లము పెల్లుడుకం దొడంగె రా
రాజుకు మున్నులంకను దిరంబుగ గైకొని సోకుమూక లెం
తేజిమీఱ నేలునటులీ రిటుపల్కుట విన్ననుండి, నే
నీజగ మందు రక్కసులనెల్ల ఋలస్త్యుకొలంబు వారిగన్.