పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/747

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

<poem>క . పెఱవారెవ్వారలకుం

       దఱియంగాఁ  దరముకానితా   వొక్కటి  నే
        నెఱి  నుండుటకున్   వేఁడఁగఁ
        మఱచితిఁ   జోటొందుచూపి  మన్నింపఁగడే .

క . అన ననుఁగుఁబట్టిమొగమ

         ల్లనఁగని  కడుబుజ్జగించి   లలినాతఁడెదం
         గనికర  మిగురొత్తంగా
         వినిపించెద   నిలువ  నెలవు   వినుమని   పలికెన్ .

గీ . ఉప్పరం బంటుతరఁగలయొప్పుతోడ

        విలువరతనంపుగుంపుల   పెంపుతోడ
        జడుపెఱుంగని  గొప్ప   మొసళ్ళతోడ
        నుప్పునీటిసంద్రము   కరంబొప్పునందు .

ఉ . జాలులయందు నందములచాలగువేలువుటేటి దీటునం

       గ్రాలెడుతావిప్రోవులను   గమ్మనికస్తురి   తానికై వడిన్
       జేలలలోనఁ  జీనిపనిచీర  తెఱంగునఁ  బూల  జూపివూ
       పోలిక  లంక  పొంకమకుఁ  బొల్పగుడీవుల  మేలుబంతియై .

సీ . పలుకోటకొమ్ముల మలఁచినసింగముల్

                                       దెసయేనుఁగులనెల్ల   దిగులుపఱుప
      నగరియుప్పరిగలమగ  ఱాలజగడాలు
                                       విన్నేటినీటితో   వియ్యమంద
       వీటనీటుగఁగ్రాలువెలిడాలుగమిగాలి
                                      వేల్పు  జంటలకును  వేడ్కలొసఁగ
      విరిదోఁట   నెత్తావి   విన్నింటవేల్పు   ఁమాఁ
                                      కుల కెల్ల  గొల్లగా  వలపులియ్య .