Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/746

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రోత్తర రామాయణము

క . మెండుపరికించి నేర్పున
        దండిమగని వల్లెత్రాడు తాల్పరినిజమున్
        గొండలపిండులుఱెక్కలు
        చెండంగలవేల్పుఱేనిఁ జేవదలిర్పన్ .

క . పొడమించి వారివరుసగఁ
        బడమరదక్కినము తూర్పువైపులకు మ్మ
        న్నొడయలనుగాఁగఁజేసియుఁ
        గడమకడనిఁకెవ్వఁడేలఁడయుండన్ .

గీ . తగినవాఁడవు దొరకితి తలఁపనేఁడు
        నాదుమదినంత యంతయునడచెనిపుడు
        గట్టువిల్కానితోఁ జెల్మికదలకుండు
        పుష్పకంబునుతేరిది వుచ్చుకొమ్ము .

చ . చలువయు వట్టయున్ వలయువందముల ప్సమకూర్చు ముజ్జగం
బులు దిరుగంగ నింగిపయిఁ బోవఁగవచ్చును దీనినెక్కి య
క్కొలఁదులు తెల్పఁదెల్ప మఱిక్రొత్త లొసంగితి నీకు నింక జ
క్కులు కొలువంగ నీకొలివికూటములోఁ గడుఁబేర్మిఁగాంచుమా .

వ . అని యొసంగి మఱియును .

క . కనికరమునఁ గనికేఅమును
      మనుమని మనుమని యటు పలుమాఱును దీనిం
      చినలువ యిచ్చను జనియెం
      దనమనికికినౌర మంచితనమని పొడగన్ .

ఉ . అంచహుమాయిజోడు చనినంతటఁ దండ్రిని జేరఁబోయి లో
నుంచినకూర్మి ఁమొక్కులిడి యుబ్బుచు లిబ్బులఱేఁడు కాంచీ దీ
వించినతండ్రిఁజూచి తమరిచ్చిన యానతి నల్వఁ గొల్చి మీ
పంచినమెప్పులం బడసివచ్చియు నొక్కటి వేఁడ నోడితిన్ .