పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/745

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>ప్రథమాశ్వాసము

క . వేయేఁడులు నీరానియు

   వేయేఁడులు గాలిఁగ్రోలి విడువకయాపై
   వేయేండ్లోగిర  మొల్లక
   యాయడవిని  దమ్మిచూలి  నతఁడు తలంపన్ .

ఉ . నిద్దపుఁబండువెన్నెలల నింపెడుసొంపగు ఱెక్కలన్

   ముద్దుమెఱుంగుఁదీవియలఁ బోలినబంగరు  రంగుచాఱలం
   దద్దయుమించునంచపయిఁ దామరచూలి  కరంబుడంగా
   నొద్దకువచ్చి  యచ్చెరువునంది కనుంగొని  నింగి నిట్లనున్ .

క . ఎమ్ములుదక్కఁగ నొక్కటి

  నెమ్మేనం  గానరాదు నిలువల్ల జెడల్
  గ్రమ్మెనుమెచ్చితిఁ దాల్మికిఁ
  గొమ్మయిదె కోర్కులిత్తుఁ గూరిమికుర్రా .

క . అని తనకమండలమున

  నినిచినతెలీనీరు మీఁద నొకయించుక చ
  ల్లిన నెప్పటిమైజిగితోఁ
  గనుపట్టియచటు  వెలువడి కడుర్మిలితోన్ .

మ. పెనులిబ్బిం గనుఁగొన్నవేదపదిం బెల్లుబ్బి కేల్దోయి మో

   డ్చినిరాబారి  కడానిబొజ్జగల జేజేమిన్న నగ్గించి యి
   ట్లనియెం  గూరిమిమీర నియ్యఁగదవయ్యా వేఁడెదన్మిమ్ముఁ జి
   క్కనిబల్మిన్ దెసయేలుమేలుఁ  బెనురొక్కంబుండుబండాలమున్ .

చ. పనిగ సతమ్ము మిమ్మొక నెపమ్మున నెమ్మది నెమ్మి నమ్మినం

  గనికరమూని వాని ముడికానిని నై నను గాతురన్న ము
  మ్మనుమని నన్ను మిన్నకయి  మన్ననఁ దిన్ననఁజేయ టబ్రమే
  యనవుడు నన్ని నీవడిగినట్టు  లొసంగితినంచు  వెండియున్ .