పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/721

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము 717

సీ.తమ్ములు నిల్లాలుఁ దారెల్లనను ఁబాయఁ
దానొక్కటియు వెంటఁదవిలియుండి
నమునమ్ముకొని వెంటఁ జను దెంచినట్టియి
వేపిని నడవిలో విడువఁజాల
నను నెప్డుఁ గనిపెట్టుకొని యున్న వారిని
నడవుల పాల్చేసి యరిగి నేను
సుగ మొందుచుండుట తగవౌనె నేనును
దప్పకయికానఁదపసి నగుచు
నుండి దీనినర యుచుందు నోరెమిడుచుఁ,
బిదప నిన్ను మెప్పించి నే వెనుక వత్తు
వేట్పుటిమ్మున కిప్పుడో వేల్పు ఱేఁడ, యరదమునుగొంచుఁగ్రమ్మఱనరుగుమివు. 159

క.అని మెమెడక పలికిన.
వినియచ్చెరుపడియెఁగరము వేలువుఱేఁడ
ల్లన నప్పుడె జాగిలమును,
దనరూపును బాసి జమువితంబును దాల్చెన్

తే.జాడ జముపట్టి తగవును జూడఁగోరి,
యట్లుచేసిన గుదెదాలు పలరె మదిని
వేల్పు ఱేఁడును నొడయని వెంటఁగొంచు
దేరిపైనెక్కియప్పుడెదివికిఁజనియెన్ 161

ఆ.ఇట్టు బొందితోడనే వేల్పుజగమున,
కేగి నారదుండు నెల్ల వేల్పు
లొలసి తన్నుఁజట్టి యుండంగనొడయండు పలుకులాడుచుండిపలికెనడుమ. 162