పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజశేఖర చరిత్రము

ఱును మాచిన్నదానికిఁ బట్టినగ్రహమును వదిలించుట యసాధ్యమని విడిచిపెట్టినారు. అతడు మూడుదినములు జల మభిమంత్రించి లోపలికిచ్చి రక్షరేకు కట్టీనాఁడు. నాఁటినుండియు పిల్లది సుఖముగా నున్నది.

                   రాజ ----మాచెల్లెలు  సుబ్బమ్మకు  దేహ  మస్వస్తముగనున్నది.
     మనగ్రామములో  నెవ్వరును  మంచివైద్యులు  కనఁబడరు.  నాకేమి  చేయుటకును  తోఁచకున్నది.

రాఘ----బైరాగిచేత మం దిప్పించరాదా! అతడు మీరు సోమ్మిచ్చిన మాత్రము పుచ్చుకొనఁడు ; ఈయూర నెందఱికో ధర్మా ర్ద్దముగానే యౌషధములిచ్చి దీర్ఘ వ్యాధులను సహితము కుదిర్చినాఁడు.

రాజ----గట్టీవాఁ డయినయెడల నీ వాతని నొక్కపర్యాయము మధ్యాహ్నము మాయింటికి వెంటబెట్టుకోనివచ్చి సుబ్బమ్మను చూపెదవా ? నాలుగుదినములనుండి దానిశరీరములో రుగ్మతగా నున్నందున వంటకు మిక్కిలి యిబ్బందిపడు చున్నాము.

రాఘ----అవశ్యముగా దిపికొనివచ్చెదను. అతని కాభేషజములు లేవు. ఎవరుపిలిచినను వచ్చును.

సిద్ధాంతి----ఆతనిజడ స్వర్ణముఖీవిద్య కలదని చెప్పుచున్నారు. మహానుభావులు గోసాయీలలో నెటువంటివారైనను నుందురు.

రాఘ----ఆతఁడు ప్రతిదినమును దమ్మిడియెత్తు రాగి కరఁగి బంగారముచేయునఁట ! ఆతఁ డప్పుడప్పుడు బ్రాహ్మణులకు దాన ధర్మములు చేయుచున్నాఁడు. ఈవిద్యయే లేకపోయిన నాతనికి ధన మెక్కడనుండి వచ్చును  ?

రాజ----రాఘవాచారీ ! దేవున కధ్యయణనోత్సవములు శ్రమ ముగా జరుగుచున్నవా  ?.