710
శుధ్దాంద్రభారతసంగ్రహము
క.పోరను జావఁగ మిగిలిన,
వారువముల నేనుఁగులను వరుసను గొనుచున్
ద్వారక కేగెను వెన్నుఁడు,
దోరినవారినిఁ దలంచి త్రొక్కటపడుచున్. 125
వసంతిలకము.వెన్నుండు చుట్టముల వేలకొలంది చావన్
గన్నారఁగాంచి వెతఁగవ్వడిఁజూచుకోరిన్
బన్నాంబు నొందియును బంచెను నాఁడెపోవం
జెన్నారదారకునిఁజెచ్చెరఁగ్రీడీఁదేరన్.
126
ఆ.ఇట్టు లతనిఁబంపి యేమియుఁదోఁచక,
కొంతతడవు లోనఁ గుందుచుండి
కడకు నిల్లువెడలి కానుల కొక్కట,
నన్నమున్ను పోయినట్ల తాను. 127
కమలవిలసితము.
చని యడవులకును సరగనునన్నున్,
గనుఁగొని జరగినఁకతఁదెలుపంగన్
విని యతఁడు నపుడె విడిచెను మేనిన్,
వనటను మఱిమఱి పనువుచువారిన్ 128
తే. అన్న పోయినపిమ్మట వెన్నుఁడడవిఁ,
దిరుగుచెందుఁ గాల్నిలుపకదిగులుతోడఁ
జెట్టు మొదలికిమేనును జేర వైచి
యొదలు వడఁకంగఁదద్దయునడలుచుండె.
తే. కాలు గదలుట దవ్వులఁగాంచియొక్క
బోయ యది యొక్కమెకమని బుద్ధిఁదలఁచి
వింటఁబలుతూపుగూరిచి వేసెనతనిఁ
జెల్లె వెన్నుండు నాదెబ్బచేత నపుడు.
పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/714
Appearance
ఈ పుట ఆమోదించబడ్డది