పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/712

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

708 శుద్ధాంధ్రభారతసంగ్రహము

 తే.కడువుతో నున్న లాగునఁగానఁబడఁ,
బుట్టములుచాలఁ బొట్టకుఁజుట్టఁబెట్టి
పలువురును గూడిచుట్టుగుంపులుగనపుడు,
నవ్వుచునువాడవాడలఁ గ్రొవ్వుమిఱ. 114

క.తిరుగుచు నా జడదారుల, సరకుఁగొనిపొయి వాని సాగిలఁబడఁగా
వేరవున నొనరిచి కడుఁబో, తరముననిట్లనిరికన్నుఁదమ్ముల నగుచున్

మధ్కాక్కర.జడదారులార యీకొమ్మ సరిగాను దొమ్మిదిలనెలల
కడుపుతోనున్నదీని కడువునఁ గూఁతు రొదవునొ
కొడుకు పుట్టునొ చెప్పుఁడయ్య కోరిక లొడఁగూడ నన్న
నొడలు మిక్కిలిమండి వార లొయ్యన నిట్లని గలుక. 116

తే.మికొలంబున కెల్లను మిత్తియైన,
పెద్దరా యొక్కఁ డీపెకు వేగఁ బుట్టుఁ,
బొండు మామాట తప్పదు పొండనంగ,
వెడలి రింటికి మోములు వెల్లవాఱ. 117

క.వారందఱు వగచుచు నిలు,
నేరం జని సాంబు కట్టుచీరను విప్పం
గా రా యొక టూడిపడెన్,
వారలయుల్లంబు లెల్ల ప్రక్కలుగాఁగన్. 118

క.పొడగిదానింగొని చని,
వడివడిఁ బొడుముగ నొనర్చి వదలక దానిం
గడలిం గలిపిరి యంతటఁ,
బొడవడఁ గెడు నంచు నెంచి పూనికి మిఱన్. 119

సీ.అట్టులు వారలఁ దిట్టినతపసుల
నోరెట్టిదో కాని నునుపుమిఱ