పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/711

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
తృతీయాశ్వాసము

707


         వేమఱును ధృతరాఘ్ట్రచే వేఁడఁబడుచు
         నునుఱులను గాచూకొనియెఁదానొక్కరుండు. 109

      క.అని చెప్పుడునేలంబడి,
         కనుఁగొలుకులనుండి నీరు కాలువపొఱం
        గను నేడ్చెఁ దల్లిఁ దండ్రిని,
       బెనుగొంతున, దలఁచి వేర్వేఱకడున్. 110

    తే.వారలిద్దిఱికొఱకు గాంధారికొఱకు,
       మిక్కిలిగ మమ్మిలించియమ్మేటిఱేఁడు
       నారదుండూఱడించిన గారమూన,
     డెందమున నొక్కయించుక కుందువాసె. 111

  క.ధృతరాఘ్టృనకును గొంతికి, వెత గాంధారికిని వేఱువేఱుగ నగ్గుల్
    జతనుపఱిచి నూవులతో, జతనంబున నీళ్ళు విడిచిచాగములిచ్చన్
 సీ.బవరంబు నడచి యిప్పుటికిని బదునెన్మి
            దేఁడులుగడచెనొక్కింతలోన
     మఱిపదియేడేండ్లు మానుగ జముపట్టి
             పుడమినేలెను వగలెడఁద బలియ
    ముప్పుదియేనేండ్లు ముగిసిన నొకనాఁడు
          వెన్నునిఁజూచెడువేడ్కతోడ
  ద్వారక కల్లవిశ్వామిత్రుఁడును నార
           దుండును గణ్వుండుఁదొడఁగి వచ్చి

   యూరిబయలనునడయాడుచుండఁజూచి,
   దుడుకుఁదనమునవెన్నునికొడుకులెల్ల
    జాంబవతికిని బుట్టిన సాంబునకును,
    నాఁడువేసంబు నమరించి యాగడమున.113
 

.