పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/708

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్ర భారతసంగ్రహము

తే. అరయనీతండు పెద్దవడై నవాడు,

బలసి పుడమిపై బెక్కేండ్లు బ్రతుకబోడు
కానలోనుంట యేయింక గరము లెస్స,
యితనినంపుమియొండా డకిపుడుఱేడ.

క. అని యెట్లో యొప్పించిన, వినియందఱు నెఱిగి వచ్చి వెలవెలవోవన్

జనుదెంచి కుంతి యడవికి బనివడి తా బావనెంట బయనంబయ్యెన్

క. మానుప జాలక యామెను, గానకు గాంద్ధారి తోడ గలగకపంపం

గానొడ బడీతికొమాళ్ళును, మేనులు వడకంగానోరు మెదలు మెదలుపకోర్మిన్

సీ. అప్పుడు ధృతరాష్ట్రుడు డనిలోన మున్నట్లు

చచ్చినవారికై చాగములను
జేయంగ గోరిన జెప్ప నలవిగాని
రొక్కంబును యుధిష్టురుండొసంగ
వచ్చలవిడి నేల వేల్పులకును నిచ్చి
చెప్పి యెల్లర వద్ద సెలవువడసి
నారచీరలు గట్టి నాతిగాంధారియు
సంజయుండును గొంతి నరప విదురుఁ
డరుగు దేరంగ వెల్వడి యదవి కేగఁ
జాలదవ్వుగ నాతని సొగ నంపి
తాను దమ్ములు వీడ్కొని తల్లి నచట
వీడు చేరెను జముపట్టివెనుకవచ్చి.

మానిని. తల్లియు నాధృతరాష్ట్రుగానకు దద్దయు వేడుకతో జనగా

నులాముపల్ల టిలగను గుందుచు నొక్కట నుండి యుధిష్టిరుడున్
బెల్లుగ నారలఁ జూచెడు కోరిక వేగిరపెట్టగ దమ్ములతో
నిల్లట వెల్వడి వారల రోయుచు నేగెను నందఱు నున్నెడకున్