పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/703

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయా శ్వాసము

 క. భగదత్తుని కొమరునితోఁ,
     దగఁబోరాటంబు సల్పి తనదుమగఁటిమి౯
     బొగడఁగ జేజేల్ గవ్వదడి,
     తెగువం గౌరును నడంచిం తెరలిచె నతనిన్.
   
 తే. అపుడు జన్నంబు చూడరానతనిఁబిలిచి,
    వారువము వెంట నచ్చొటువసిక్రిడి
    చేరె లాత్రివిలాతిని సింధువ నెడు,
    పేర ఁబరఁగెడుదానినిఁ బెంపుమిగుల.
 క.

తనతండ్రిఁ జంపినాతఁడు
చనుదెంచె ననంగ గుండె జల్లనవినిగ్ర
క్కున నునుఱులు విడిచెను నిం
టనె స్తెంధవునికొమరుఁడు దిటం బెడలంగన్.
 
తే. అతనికొడుకును నెత్తికొం చచటి కపుడు
    వచ్చి దుస్సల వివ్వచ్చు పజ్జ నిలిచి
    బుడుత నాతని కాళ్ల పై ఁబడఁగవై చి
    కన్నులను నీరు కాల్వలుగట్ట పనియె.